మాస్ మహరాజా రవితేజ మంచి జోరుమీదున్నాడు.వరుస సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే క్రాక్ చిత్రంతో మంచి హిట్ కొట్టిన రవితేజ ఇప్పుడు ఖిలాడి చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సోదరుడు సాగర్ ఈ చిత్రానికి మాటలను అందిస్తున్నాడు. హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం రామారావు ఆన్‌డ్యూటీ అనే చిత్రంతో పాటు ధమాకా అనే చిత్రాలు చేస్తున్నాడు రవితేజ. హిట్ దర్శకుడు త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుండగా, తాజాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు సమాచారం. ఫస్ట్ షెడ్యూల్ ఇంత స్పీడ్‌గా కంప్లీట్ చేయడంపై అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇందులో ‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల రవితేజ సరసన నటిస్తోంది.