శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 09, 2020 , 18:29:19

న‌న్ను ఇష్ట‌ప‌డ‌టం వ‌ల్లే శ్రావ‌ణికి స‌మ‌స్య‌లు

న‌న్ను ఇష్ట‌ప‌డ‌టం వ‌ల్లే శ్రావ‌ణికి స‌మ‌స్య‌లు

టీవీ న‌టి శ్రావణి ఆత్మ‌హ‌త్య కేసులో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. త‌న‌పై ప‌లు క‌థ‌నాలు వ‌స్తున్న నేప‌థ్యంలో దేవ‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని విష‌యాలు వెల్ల‌డించాడు. కుటుంబ‌స‌భ్యులు, సాయి అనే వ్య‌క్తి శ్రావ‌ణి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని స్ప‌ష్టం చేశాడు.  సెప్టెంబ‌ర్ 7న తాను, శ్రావ‌ణి ఇద్ద‌రూ క‌లిసి డిన్న‌ర్ కు వెళ్ల‌గా..సాయి అనే వ్య‌క్తి వ‌చ్చి శ్రావ‌ణిని కొట్టాడ‌ని చెప్పాడు. శ్రావ‌ణికి సాయి గ‌త ఐదేళ్లుగా ప‌రిచ‌యం ఉంద‌ని, తన‌కు శ్రావ‌ణి ప‌రిచ‌యం అయి ఏడాది మాత్రమే అవుతుంద‌ని దేవ్ రాజ్ తెలిపాడు.

శ్రావ‌ణి చివ‌రిసారిగా త‌న‌తో ఫోన్ లో మాట్లాడుతూ..మా అమ్మానాన్న న‌న్ను తీవ్రంగా కొట్టారు. మా త‌మ్ముడు నన్ను హింసించాడు. సాయి న‌న్ను రోడ్డుపై జుట్టు ప‌ట్టుకుని దారుణంగా కొట్టాడు. వారి ముఖాలు జీవితంలో చూడ‌ద‌ల‌చుకోవ‌డం లేద‌ని, త‌న చావుకు కార‌ణం సాయి అనే వ్య‌క్తి అని చెప్పింద‌ని దేవ్ రాజ్ చెప్పాడు. అయితే శ్రావ‌ణిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాన‌ని ఎస్ ఆర్ న‌గ‌ర్ పీఎస్ లో త‌న‌పై న‌మోదైన కేసు త‌ప్పుడు కేసు అని..కుటుంబ‌స‌భ్యుల ఒత్తిడితోనే త‌న‌పై కేసులు పెట్టిన‌ట్టు ఈ విష‌యాన్ని శ్రావ‌ణి స్వ‌యంగా చెప్పిన‌ట్టు దేవ్ రాజ్ పేర్కొన్నారు. త‌న‌ను ఇష్ట‌ప‌డ‌టం వ‌ల్లే శ్రావ‌ణి ఇవ‌న్నీ స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని దేవ్ రాజ్ వెల్ల‌డించాడు. ఈ నేపథ్యంలో సాయితోపాటు ప‌లు కోణాల్లో కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.