మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 09:38:46

ఎలిమినేష‌న్‌లో బిగ్ ట్విస్ట్‌.. ఊహించ‌ని కంటెస్టెంట్ ఔట్

ఎలిమినేష‌న్‌లో బిగ్ ట్విస్ట్‌.. ఊహించ‌ని కంటెస్టెంట్ ఔట్

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మం ర‌స్త‌వ‌త్త‌రంగా సాగుతుంది. మొద‌ట్లో ప్రేక్ష‌కుల‌కు కాస్త బోర్ తెప్పించిన బిగ్ బాస్ ఇప్పుడు షోపై చాలా ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ అంతా ఊహించిన‌ట్టే జ‌ర‌గ‌గా, మూడో వారంకు సంబంధించి హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ విష‌యంలో ప్రేక్ష‌కుల‌కు ఊహించ‌ని ట్విస్ట్ ఎదురైంది. ఎలిమినేట‌ర్ పేరు ప్ర‌క‌టించ‌డంతో హౌజ్‌మేట్స్ తో పాటు టీవీ చూసే ప్రేక్ష‌కులు కూడా షాక్ అయ్యారు. 

సండే..ఫన్ డే అంటూ కంటెస్టెంట్స్‌తో స‌ర‌దాగా గేమ్స్ ఆడించారు నాగార్జున. ఎప్పుడు నేను మాట్లాడుతుంటాను. ఈ సారి మీరు మాట‌, ఆట రెండింటితో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌మ‌ని కోరాడు. ముందుగా అరియానా గ్లోరి బోట‌నీ ఆట ఉంది అనే పాట‌కు పేర‌డి చేసి పాడి నాగ్‌ని ఇంప్రెస్ చేసింది. ఇక బిగ్ బాస్ రికార్డ్ ఎవ‌రు సెట్ చేస్తారో అంటూ జంట‌లుగా గేమ్స్ ఆడించారు. ముందుగా రాజశేఖ‌ర్, అభిజిత్ బెలూన్స్ ప‌గ‌ల‌గొట్టే గేమ్ ఆడ‌గా, ఇందులో అమ్మ‌ రాజ‌శేఖ‌ర్ చేతులు ఉప‌యోగించ‌కుండా 50 బెలూన్స్ ప‌గ‌ల‌గొట్టి బిగ్ బాస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ‌

అనంత‌రం లాస్య‌, దేవిలు ట‌వ‌ర్‌ని నిర్మించే ప్ర‌య‌త్నం చేయ‌గా, ఇద్ద‌రు విఫ‌ల‌మ‌య్యారు. త‌ర్వాత సోహైల్‌, కుమార్ సాయి స్ట్రా గేమ్ ఆడారు. స్ట్రాలు ఎవ‌రు ఎక్కువ నోట్లో పెట్టుకుంటే వారే విజేత‌లు అని ప్ర‌క‌టించ‌గా, ఇందులో సాయి ఎక్కువ స్ట్రాలు నోట్లో ఉంచుకొని విజేత‌గా నిలిచాడు. ఇక సాక్స్ గేమ్‌లో హారికపై సాక్షి దీక్షిత్ గెలిచింది. అఖిల్-మొహబూబ్‌లు స్కిప్పింగ్ గేమ్ ఆడ‌గా.. మొహబూబ్ 100 స్కిప్స్ చేయ‌గా, అఖిల్ 50 చేశాడు . దీంతో మెహ‌బూబ్ విజేత‌గా నిలిచాడు. సుజాత‌, అవినాష్ బ్రెడ్ గేమ్ ఆడ‌గా అందులో అవినాష్ గెలిచాడు. దియా, మోనాల్ మ‌ధ్య జ‌రిగిన యాపిల్ గేమ్ లో దిశా విజ‌యం సాధించింది. 

మూడో వారం నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురు ఇంటి స‌భ్యులు లాస్య, దేవి, మోనాల్ గజ్జర్, కుమార్ సాయి, మెహబూబ్, అరియానా, దేత్తడి హారికలలో శ‌నివారం రోజు లాస్య‌, మోనాల్ సేవ్ అయిన‌ట్టు ప్ర‌క‌టించారు నాగ్. ఇక ఆదివారం రోజు డ్యాన్స్ చేపిస్తూ మెహ‌బూబ్, హారిక‌,అరియానాల‌ని సేవ్ అయిన‌ట్టు తెలిపారు నాగార్జున‌. ఇక చివ‌రికి ఎలిమినేష‌న్‌లో కుమార్ సాయి, దేవి ఉన్నారు. వీరిలో ఎవ‌రు సేవ్ అవుతారు, ఎవ‌రు వెళ్ళిపోతారు తెలుసుకునేందుకు రెండు బాక్స్ లు తెప్పించి  అందులో చేయి పెట్ట‌మ‌ని అన్నారు నాగార్జున‌. ఎవరి చేతికి ఎరుపు రంగు ఉంటే వారు ఎలిమినేట్ అవుతార‌ని చెప్పారు.

దేవి చేతికి ఎరుపు రంగు అంట‌డంతో ఆమెని ఎలిమినేట్ అయిన‌ట్టు ప్ర‌క‌టించారు కింగ్ నాగ్. దీంతో హౌజ్ మొత్తం షాక్ అయింది. అరియానా అయితే వెక్కి వెక్కి ఏడ్చింది . ‘నేను ఎలిమినేట్ అయినా ఇంత బాధపడేదాన్ని కాదక్కా’ అంటూ దేవిని పట్టుకుని తెగ ఏడ్చేసింది అరియానా. మిగ‌తా వాళ్ళు కూడా చాలా బాధ‌ప‌డ్డారు. చివ‌ర‌కు దేవికి ధైర్యం చెప్పి పంపారు. ఇక స్టేజ్ మీదికి వచ్చిన దేవి నాగవల్లిని ఎలిమినేట్ అవడానికి కారణం ఏమై ఉంటుందని నాగార్జున అడగ్గా.. నాకు తెలియదు సార్ అని దుఖాన్ని దిగమింగుకుంటూ చెప్పింది దేవి.

ఎంతో బాధ‌తో ఉన్న దేవిని చూసి నాగార్జున కూడా ఆశ్చ‌ర్య‌పోయారు. ఆమెను ఎప్పుడు ఇలా చూడ‌లేద‌ని పేర్కొన్నాడు. ఇక ఇంటి స‌భ్యులకు ప‌లు సూచ‌న‌లు చేసిన త‌ర్వాత దేవి ‘నువ్వుంటే నా జతగా’ అంటూ ఎమోషనల్ సాంగ్ పాడి అంద‌రిని ఏడిపించారు. చివ‌ర‌కు ఒక హౌజ్‌మేట్‌ను సేవ్ చేసే బిగ్ బాంబ్ ఎవ‌రిపై వేస్తావు నాగార్జున అడ‌గ‌గా, ఆ ఛాన్స్ అరియానాకు ఇచ్చింది. దీంతో ఆదివారం ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ ప‌డింది. మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్  అంద‌రి మైండ్స్ బ్లాక్ అయ్యేలా చేసింది. 


logo