శుక్రవారం 29 మే 2020
Cinema - Jan 16, 2020 , 23:52:03

లఘుచిత్రంలో శృతిహాసన్‌

లఘుచిత్రంలో శృతిహాసన్‌

సినిమాలకు పరిమితం కాకుండా కథ నచ్చితే వెబ్‌సిరీస్‌లు, షార్ట్‌ఫిలిమ్స్‌లో నటించడానికి ఆసక్తిని చూపుతున్నారు కథానాయికలు. బాలీవుడ్‌ నటి కాజోల్‌, శృతిహాసన్‌ తొలిసారి హిందీలో ఓ లఘు చిత్రంలో నటిస్తున్నారు. ‘దేవి’ పేరుతో మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ లఘు చిత్రంలో కాజోల్‌, శృతిహాసన్‌తో పాటు నేహాధూపియా, నీనా కులకర్ణి, ముక్తా బార్వే కీలక పాత్రల్ని పోషించనున్నారు. భిన్న ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది మహిళలు ఒకే రూమ్‌లో జీవనం సాగిస్తూ తమ జీవితంలోని విషాధాల్ని, బాధల్ని ఎలా పంచుకున్నారనే కథాంశంతో ఈ లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రియాంక బెనర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కేవలం రెండు రోజుల్లో ఈ షార్ట్‌ఫిల్మ్‌ చిత్రీకరణ పూర్తిచేశారు.


logo