శనివారం 30 మే 2020
Cinema - May 03, 2020 , 08:34:33

దేవి శ్రీ ప్ర‌సాద్‌ రాక్ షో- వీడియో

దేవి శ్రీ ప్ర‌సాద్‌ రాక్ షో- వీడియో

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ క‌రోనా వ‌ల‌న ఇబ్బందులు ప‌డుతున్న పేద ప్ర‌జ‌ల‌ని ఆదుకునేందుకు వ‌న్ నేష‌న్ ఎట్ హోమ్ అనే కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టారు. ఇంట్లోని త‌న స్టూడియోలో కూర్చొని తెలుగు, త‌మిళ సాంగ్స్ పాడి శ్రోత‌ల‌ని ఉత్తేజ‌ప‌ర‌చారు. మ‌రోవైపు స్టెప్పులు కూడా వేసి ఫుల్ జోష్ తెచ్చారు. ఏప్రిల్ 30న జ‌రిగిన ఈ ప్ర‌ద‌ర్శ‌నకి సంబంధించిన వీడియోని దేవి శ్రీ ప్ర‌సాద్ తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.

యూ ట్యూబ్ స‌మ‌ర్పించిన వ‌న్ నేష‌న్ ఎట్ హోమ్ లో లైవ్ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాను. దీన్ని మీరంద‌రు ఎంజాయ్ చేస్తార‌ని భావిస్తున్నాను. సాంగ్స్‌తో పాటు డ్యాన్స్ మిక్స్ చేశా. ఇంట్లోనే ఉండి సుర‌క్షితంగా ఉండండి అని దేవి త‌న ట్వీట్‌లో తెలిపారు.


logo