గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 23:39:14

వారసులే ఎక్కువ కష్టపడాలి!

వారసులే ఎక్కువ కష్టపడాలి!

సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన వారంతా సక్సెస్‌ అవుతారని అనుకోవడం అపోహ మాత్రమేనని అంటోంది కథానాయిక రాధికా ఆప్టే. సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లోని బంధుప్రీతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  నెపోటిజం కారణంగా ప్రతిభావంతులైన నటులు అవకాశాల్ని కోల్పోతున్నారనే వాదన వినిపిస్తోంది. దీనిపై రాధికా ఆప్టే మాట్లాడుతూ ‘సినీ పరిశ్రమలో రాణించడానికి ఇన్‌సైడర్స్‌, ఔట్‌సైడర్స్‌ ఎవరైనా కష్టపడాల్సిందే. తమపై ఉన్న అంచనాలు, బాధ్యతల్ని నిలబెట్టుకోవడానికి బయటివారితో పోలిస్తే వారసులు మరింత ఎక్కువగా శ్రమించాలి. కుటుంబ నేపథ్యం ఉంటే విజయాల్ని అందుకోగలమని అనుకుంటే పొరపాటే అవుతుంది. బంధుప్రీతిని నిర్వచించడం కష్టమే. చాలా సంక్లిష్టమైన, లోతైన అంశాలతో ముడిపడిన ఈ విషయం గురించి సులభంగా సమాధానం చెప్పడం సాధ్యంకాదు.  విస్త్రత పరిధిలో చర్చించాల్సిన అంశమిది. సమాజంలోని అన్ని రంగాలు బంధుప్రీతిని ప్రోత్సహిస్తున్నాయి. అందుకు సినీ పరిశ్రమ అతీతమేమీ కాదు’ అని తెలిపింది. 


తాజావార్తలు


logo