శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 13:13:00

ఆ హీరోయిన్‌కు సంబంధించిన వార్త‌లు రాయ‌కండి..

ఆ హీరోయిన్‌కు సంబంధించిన వార్త‌లు రాయ‌కండి..

మాద‌క ద్ర‌వ్యాల కేసులో ర‌కుల్ హ‌స్తం కూడా ఉంద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇటీవ‌ల ఎన్సీబీ ఆమెను నాలుగు గంట‌ల పాటు విచారించిన సంగ‌తి తెలిసిందే. ఈ విచార‌ణ‌లో తాను ఎప్పుడు  డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని, రియానే త‌న ఇంట్లో డ్ర‌గ్స్ దాచిపెట్టింద‌ని పేర్కొంది. అయితే మీడియా నిజ‌నిజాలు తెలుసుకోకుండా క‌థ‌నాలు వెలువ‌రిస్తూ, మాన‌సికంగా వేధిస్తున్నార‌ని, ఆ క‌థ‌నాల‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని ఢిల్లీ హైకోర్టును రెండోసారి ఆశ్ర‌యించింది ర‌కుల్. 

ర‌కుల్ పిటీష‌న్‌ను స్వీక‌రించిన ఢిల్లీ హైకోర్టు.. కేంద్రంతో పాటు సమాచార, ప్రసార శాఖ, ప్రసార భారతి, ఎన్‌బీఏ, ప్రెస్‌ కౌన్సిల్‌కు మ‌ధ్యంతర ఉత్త‌ర్వులు జారీ చేసింది.   ర‌కుల్ డ్ర‌గ్స్ కేసు విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు మీడియాలో క‌థ‌నాలు నియంత్రించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. ర‌కుల్‌కు సంబంధించి ఎలాంటి వార్త‌లు ప్రింట్ చేయోద్దు, ప్ర‌సారం చేయోద్దు. ఈ విష‌యంలో మీడియా కొంత స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని సూచించింది. కాగా, ర‌కుల్ రీసెంట్‌గా ముంబై నుండి హైద‌రాబాద్‌కు తిరిగి రాగా, ప్ర‌స్తుతం షూటింగ్స్‌లో పాల్గొంటుంది.