శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 17:46:33

ఢిల్లీ గాళ్ టు ప‌క్కా తెలుగ‌మ్మాయి: ర‌కుల్‌

ఢిల్లీ గాళ్ టు ప‌క్కా తెలుగ‌మ్మాయి: ర‌కుల్‌

2011లో వ‌చ్చిన కెర‌టం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించింది ఢిల్లీ భామ ర‌కుల్ ప్రీత్‌సింగ్. ఆ త‌ర్వాత సందీప్ కిష‌న్ తో క‌లిసి న‌టించిన వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ బ్యూటీ తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నేటితో ఏడేండ్లు పూర్తి చేసుకుంది. ఏడేండ్ల కింద‌ట దిగిన ఫొటోను, ప్ర‌స్తుత ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ర‌కుల్‌...ఓ పోస్ట్ ను పెట్టింది.

నేను అప్పు‌డు, ఇప్పుడూ న‌వ్వుతూ ఉండ‌టానికి కార‌ణంగా..మీరంతా ఎంతో ప్రేమ‌తో న‌న్ను అంగీక‌రించ‌డం. ఢిల్లీ అమ్మాయి నుంచి ప‌క్కా తెలుగు అమ్మాయిగా మారే వ‌ర‌కు అద్భుత‌మైన ప్ర‌యాణం. న‌న్ను న‌మ్మిన ప్ర‌తీ ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, స్నేహితుడు, అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ప్ర‌తీ రోజు న‌న్ను నేను ఉత్త‌మంగా తీర్చిదద్దుకునేందుకు ఓ వైపు ప్ర‌శంసిస్తూ, మ‌రోవైపు విమ‌ర్శించిన మీ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. నా కుటుంబం, మేనేజ‌ర్, టీం లేకుండా ఈ ప్ర‌యాణం లేదని పోస్ట్ లో పేర్కొంది. ప్ర‌స్తుతం హిందీ, తెలుగులో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ర‌కుల్‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.