ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 11, 2020 , 16:16:02

హోటల్‌ లాబీలో దీపికా స్లో మోషన్‌ వాక్‌..వీడియో చక్కర్లు

హోటల్‌ లాబీలో దీపికా స్లో మోషన్‌ వాక్‌..వీడియో చక్కర్లు

రామ్‌లీలా, పద్మావత్‌ వంటి చిత్రాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించి అభిమానులను పెంచుకుంది బాలీవుడ్‌ బ్యూటీ దీపికాపదుకొనే. ట్రెండీ కాస్ట్యూమ్స్‌లో మెరిసే తారల్లో దీపికా పదుకొనే కూడా ఒకరు. ఫ్యాషన్‌ ఐకాన్‌గా కనిపించే ఈ భామ ఫ్యాషన్‌ వీక్‌ షోల్లో పాల్లొన్నది. లాబీ నుంచి ఫ్యాషన్‌ షో స్టేజీ వరకు మోడల్స్‌, తారల కోసం నిర్వాహకులు రెడ్‌ కార్పెట్‌ పరుస్తారనే విషయం తెలిసిందే.

అయితే ఫ్యాషన్‌ షోలో పాల్గొనే ముందు మెల్లగా ర్యాంప్‌ వాక్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నట్టుగా ఉన్న స్లో  మోషన్‌ వాక్‌ వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ వస్త్రధారణలో అబ్బురపరిచే అందంతో హాటల్‌ లాబీలోని రెడ్‌కార్పెట్‌పై నుంచి ఫన్నీగా నడుచుకుంటూ వస్తున్న వీడియో..హోటల్ లాబీ ఫ్యాషన్ వీక్ పేరుతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.  logo