శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 12, 2020 , 09:51:29

హీరోయిన్ మ‌ధుర జ్ఞాప‌కాలు.. ఫోటోలు వైర‌ల్

హీరోయిన్ మ‌ధుర జ్ఞాప‌కాలు.. ఫోటోలు వైర‌ల్

లాక్‌డౌన్ వ‌ల‌న మ‌న సినీ సెల‌బ్రిటీల‌కి కావ‌ల‌సిన దానిక‌న్నా మ‌రింత ఎక్కువ స‌మ‌యం దొర‌కుతుంది. ఆ స‌మ‌యాన్ని చ‌క్క‌గా వినియోగించుకుంటూ ఆనందంగా గ‌డుపుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణేకి లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే ప‌రిమితం కావ‌డంతో ఈ గ్యాప్‌లో కొంత వంట‌కాలు నేర్చుకుంటుంది. ఇంటి ప‌నులు, వంట ప‌నులు అన్నీ తానే చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

మ‌రోవైపు త‌న మ‌ధుర జ్ఞాప‌కాల‌ని కూడా నెమ‌రువేసుకుంటున్న దీపికా తాజాగా త‌న స్కూల్ డేస్‌కి సంబంధించిన ఫోటో షేర్ చేసి నెటిజ‌న్స్‌కి ఆనందాన్నిపంచింది . 1995లో బెంగ‌ళూరు సోఫియా హైస్కూల్‌లో జరిగిన ఆటల పోటీల్లో తనకు వచ్చిన బహుమతుల గురించి అప్పట్లో రాసిపెట్టిన ఒక పేపర్.. జ్ఞాపికలు, సర్టిఫికెట్లతో తీసుకున్న తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో దీపికా పొందుపరిచారు. ఇందులో తాను లాంగ్ జంప్‌లో ఫస్ట్, 75 మీటర్ల రన్నింగ్‌లో ఫస్ట్, 50 మీటర్ల రన్నింగ్‌లో సెకండ్, 8x50 మీటర్ల రిలేలో సెకండ్‌తో పాటు ఓవరాల్ ఇండివిడ్యువల్ ఛాంపియన్‌షిప్ కప్‌ను గెలుచుకున్నారు. ఇవ‌న్నీ చూస్తుంటే దీపికా చిన్న‌ప్పటి నుండే ఛాంపియ‌న్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.  logo