ఆదివారం 07 జూన్ 2020
Cinema - Apr 03, 2020 , 13:50:54

భ‌ర్త త‌లపై హ‌జ్బెండ్ లేబుల్ అతికించిన స్టార్ హీరోయిన్

భ‌ర్త త‌లపై హ‌జ్బెండ్ లేబుల్ అతికించిన స్టార్ హీరోయిన్

కరోనా ఎఫెక్ట్‌తో కేంద్ర ప్ర‌భుత్వం 21 రోజుల లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. దీంతో జ‌నాలంద‌రు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.ఇక సాటి మ‌నిషితో స్వేచ్ఛగా మాట్లాడలేని ఈ త‌రుణంలో  ఎక్కువ మంది సోష‌ల్ మీడియా ద్వారానే కాల‌క్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా సెల‌బ్రిటీలు త‌మ‌ దైనందిన కార్య‌కలాపాల‌కి సంబంధించిన విష‌యాలు త‌ర‌చుగా షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌కి కాస్త వినోదాన్ని అందిస్తున్నారు.

ఇటీవ‌ల‌ బాలివుడ్ అందాల భామ దీపికా ప‌దుకునే త‌న భ‌ర్త ర‌ణ్‌వీర్ రోజుకి  20 గంట‌లు నిద్ర‌కి కేటాయిస్తున్నాడ‌ని, మిగిలిన 4 గంట‌లు ఇద్ద‌రం క‌లిసి సినిమాలు చూస్తామ‌ని పేర్కొంది. తాజాగా త‌న భ‌ర్త నిద్రిస్తున్న స‌మ‌యంలో నుదిటిపై హజ్బెండ్ అనే లేబుల్ అతికించి ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది.  ర‌ణ్‌వీర్ నిద్ర‌పోతున్న స‌మ‌యంలో వంట‌గ‌దికి ప‌రిమిత‌మై  భార‌తీయుల వంట నేర్చ‌కుంటున్న దీపికా ఇటీవ‌ల పేర్కొన్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా వంట‌ల్లో వాడే  ధ‌నియాలు, పుదీనా, గోధుమ‌పిండి వంటి వాటి తేడాలు తెలుసుకునే ప‌నిలో ఉన్న‌ది దీపికా.  


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo