శనివారం 06 జూన్ 2020
Cinema - May 16, 2020 , 16:26:21

ఆక‌లితో ఉన్నా కూడా అమీర్ అన్నం పెట్ట‌లేదు: దీపికా

ఆక‌లితో ఉన్నా కూడా అమీర్ అన్నం పెట్ట‌లేదు: దీపికా

బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే లాక్ డౌన్ స‌మ‌యంలో త‌న చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవ‌ల త‌న స్కూల్‌కి సంబంధించిన విష‌యాల‌ని షేర్ చేసిన దీపికా తాజాగా 20 ఏళ్ళ క్రితం అమీర్‌ఖాన్‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. అప్ప‌టి మెమోరీస్ గుర్తు చేసుకున్నారు.

న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా అమీర్ ఖాన్ మా ఇంటికి వ‌చ్చారు. అప్పుడు నాకు 13 ఏళ్ళు. ఆయ‌న‌తో ఉండ‌డం కొంత ఇబ్బందిగా అనిపించిన‌ప్ప‌టికీ, అక్క‌డే ఉన్నాను. లంచ్ స‌మ‌యంలో అమీర్ పెరుగన్నం తిన్నాడు. నేను ఎప్ప‌టిలాగానే ఆక‌లితో ఉన్నాను. అత‌ను నాకు క‌నీసం ఆఫ‌ర్ చేయ‌లేదు. నేను కూడా అడ‌గ‌లేదు అనుకోండి అంటూ జ‌న‌వ‌రి1, 2000 రోజు దిగిన ఫోటోని షేర్ చేసింది దీపిక‌. ఈ ఫోటోలో  దీపిక బ్లాక్ డ్రెస్‌లో క‌నిపిస్తుండ‌గా, ఆమె తండ్రి ప్ర‌కాష్ ప‌దుకొనె, త‌ల్లి ఉజ్జ‌ల‌, సోద‌రి అనిషా ఉన్నారు.


logo