గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 13, 2020 , 00:23:28

అట్లీ దర్శకత్వంలో ‘సంకీ’

అట్లీ దర్శకత్వంలో ‘సంకీ’

షారుఖ్‌ఖాన్‌, దీపికాపదుకునే జోడీ వెండితెరపై విజయవంతమైన కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నారు. షారుఖ్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘ఓం శాంతి ఓం’ చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమైంది దీపికాపదుకునే. అనంతరం వీరిద్దరు కలిసి ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌' ‘హ్యాపీ న్యూ ఇయర్‌' చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ హిట్‌పెయిర్‌ మరోమారు వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమిళ అగ్ర దర్శకుడు అట్లీ నిర్ధేశకత్వంలో షారుఖ్‌ఖాన్‌ ‘సంకీ’ పేరుతో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇందులో షారుఖ్‌కు జోడీగా దీపికాపదుకునే నటించబోతున్నదని తెలిసింది. గత కొన్నేళ్లుగా అపజయాలతో సతమతమవుతున్న షారుఖ్‌ఖాన్‌ ప్రస్తుతం సినిమాల ఎంపికలో జాగ్రత్తగా  వ్యవహరిస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించనున్న ‘పఠాన్‌' చిత్రంలో షారుఖ్‌ నటించనున్నారు.  ఈ సినిమాతో పాటు అట్లీ దర్శకత్వం వహించే చిత్రాన్ని సమాంతరంగా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.logo