గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 18, 2020 , 12:31:25

ఆ ముగ్గురికి ఛాలెంజ్ విసిరిన దీపికా ప‌దుకొణే

ఆ ముగ్గురికి ఛాలెంజ్ విసిరిన దీపికా ప‌దుకొణే

ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో ఛాలెంజ్‌లు వ‌చ్చాయి. వాటిలో దేనిక‌దే ప్ర‌త్యేకం. తాజాగా సేఫ్ హ్యాండ్స్ అనే ఛాలెంజ్ న‌డుస్తుంది. కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో టెడ్రోస్ అధ‌నామ్ గెబ్ర‌యెసుస్‌( డ‌బ్ల్యూహెచ్‌వో జ‌న‌ర‌ల్ డైరెక్ట‌ర్‌) స‌రికొత్త ఛాలెంజ్‌ని తీసుకొచ్చారు. ఈ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన వారు చేతుల‌ని శుభ్రంగా క‌డుక్కోవ‌డంతో పాటు మ‌రో ముగ్గురు లేదా న‌లుగురికి ఛాలెంజ్ విస‌రాలి. 

టెడ్రోస్ .. బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణేకి సేవ్ హ్యాండ్స్ ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ స్వీక‌రించిన అమ్మ‌డు  చేతుల‌ని స‌బ్బుతో శుభ్రంగా క‌డుక్కుంటున్న వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్ విరాట్ కోహ్లీ, రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌, క్రిస్టియానో రొనాల్డోల‌ని నామినేట్ చేసింది. త‌న‌ని నామినేట్ చేసిన టెడ్రోస్‌కి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేస్తూ.. ఈ ఛాలెంజ్ ప్ర‌జ‌ల ఆరోగ్యంని త‌ప్ప‌క కాపాడుతుంది. దీనిని ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌క పాటించాల‌ని పిలుపునిచ్చింది దీపికా. ఇదిలా ఉంటే డాక్ట‌ర్ టెడ్రోస్‌.. ప్రియాంక చోప్రా, ఆర్నాల్డ్‌, మోడ‌ల్ క్రిస్టి ట‌ర్లింగ్టంన్‌ల‌ని కూడా నామినేట్ చేశారు. 


logo