గురువారం 04 జూన్ 2020
Cinema - May 09, 2020 , 11:25:19

ఇర్ఫాన్ వీడియోతో పీకూ జ్ఞాప‌కాల‌ని గుర్తు తెచ్చుకున్న దీపికా

ఇర్ఫాన్ వీడియోతో పీకూ జ్ఞాప‌కాల‌ని గుర్తు తెచ్చుకున్న దీపికా

బాలీవుడ్ స్టార్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ హ‌ఠాన్మ‌ర‌ణం ఎంద‌రినో క‌ల‌చివేసింది. ఆయ‌న లేర‌న్న వార్త‌ని జీర్ణించుకోవ‌డం క‌ష్ట‌సాధ్యంగానే ఉంది. ఆయ‌న‌తో న‌టించిన స్టార్స్ అయితే ఇర్ఫాన్ జ్ఞాప‌కాల‌ని త‌ల‌చుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా దీపికా ప‌దుకొణే త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా ఇర్ఫాన్‌కి సంబంధించిన ప‌లు ఫోటోలు , వీడియోలు షేర్ చేస్తూ భావోద్వేగానికి గుర‌వుతుంది.

సూజిత్ స‌ర్కార్ ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన పీకూ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద మంచి హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ఇర్ఫాన్, దీపికా ముఖ్య పాత్ర‌లు పోషించారు. మే 8,2015న విడుద‌లైన ఈ చిత్రం శుక్ర‌వారంతో ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా సెట్స్‌లో ఇర్ఫాన్‌తో క‌లిసి ఉన్న క్ష‌ణాల‌ని షేర్ చేస్తూ వ‌స్తుంది దీపికా. రీసెంట్‌గా మెమొర‌బుల్ స్టిల్‌ని షేర్ చేసిన దీపికా ఇప్పుడు ఆయ‌న‌తో టెన్నిస్ ఆడుతున్న వీడియోని షేర్ చేసింది. దీనికి ఇర్ఫాన్ ఖాన్.. ద‌యచేసి తిరిగిరా అనే క్యాప్ష‌న్ రాసింది. ఏప్రిల్ 29,2020న ఇర్ఫాన్ క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. logo