బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రస్తుతం షారుక్ ఖాన్ తో పఠాన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా తనలోని మాస్ యాక్షన్ అవతార్ ను ప్రేక్షకులకు మరోసారి చూపించబోతుందట. ఇప్పటికే హాలీవుడ్ ప్రాజెక్టు ట్రిపుల్ ఎక్స్..రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ చిత్రం పవర్ ప్యాక్ డ్ ఎంట్రీ సీన్ తో అదరగొట్టిన దీపికా పదుకొనే ఈ సారి పఠాన్ కోసం మళ్లీ యాక్షన్ లోకి దిగబోతుంది.
బీటౌన్ సర్కిల్ నుంచి పఠాన్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం దీపికా పదుకొనే హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటుందట. ఇప్పటికే దీపికా యాక్షన్ పార్టు కోసం ప్రిపరేషన్ కూడా పూర్తి చేసినట్టు బీటౌన్ టాక్. ముంబైలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. ఈ భామ పఠాన్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసింది.
దీపికా పదుకొనే మరోవైపు శకున్ బత్ర డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షెడ్యూల్ పై కూడా దృష్టి పెట్టనుంది. వీటితోపాటు నాగ్ అశ్విన్-ప్రభాస్ ప్రాజెక్టు, ది ఇంటర్న్ రీమేక్, మహా భారత, 83, ఫైటర్ సినిమాలు కూడా లైన్ లో పెట్టింది.
ఇవి కూడా చదవండి..
తమన్నా స్పెషల్ సాంగ్..హాట్ టాపిక్ గా రెమ్యునరేషన్..!
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
మరోసారి స్పెషల్ సాంగ్ లో తమన్నా..!
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..