మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 23, 2020 , 00:10:14

ఒక్క సినిమా చూడలేదు!

ఒక్క సినిమా చూడలేదు!

బాల్యంలో  తనకు సినిమాలు, వినోదప్రపంచం అంటే ఏమిటో తెలిసేది కాదని...క్రీడలే లోకంగా పాఠశాల రోజులు గడచిపోయాయని చెప్పింది అగ్ర కథానాయిక దీపికాపడుకోన్‌. ఇటీవలే ఆమె ఓ టెలివిజన్‌ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా తన బాల్యం గురించి చెబుతూ ‘మా నాన్న ప్రకాష్‌ పడుకోన్‌ స్టార్‌ బ్యాడ్మింటన్‌ ఆటగాడు కావడవ వల్లే ఇంట్లో క్రీడా వాతావరణం కనిపించేది. స్కూల్‌ నుంచి రాగానే బ్యాడ్మింటన్‌ కోర్ట్‌లోకి అడుగుపెట్టేదాన్ని. డిన్నర్‌ సమయం వరకు అక్కడే ప్రాక్టీస్‌తో కాలం గడచిపోయేది. స్నేహితులతో ముచ్చట్లు, సినిమాలు, సరదాలు అస్సలు ఉండేవి కావు. స్కూల్‌రోజుల్లో ఒక్క సినిమా కూడా చూడలేదు. నా దినచర్య రోజు ఒకేలా అనిపించేది. క్రీడా నేపథ్యంలోని క్రమశిక్షణ, త్యాగం, అంకితభావం అలవడ్డాయి కాబట్టే బాలీవుడ్‌లో పరిశ్రమలో అగ్రశ్రేణి నాయికగా ఎదిగాను’ పేర్కొంది.logo