ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 26, 2020 , 16:57:17

5 గంట‌ల పాటు దీపిక విచార‌ణ‌.. క్లీన్ చిట్ ఇవ్వ‌ని ఎన్సీబీ

5 గంట‌ల పాటు దీపిక విచార‌ణ‌.. క్లీన్ చిట్ ఇవ్వ‌ని ఎన్సీబీ

హైద‌రాబాద్‌: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఇవాళ బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో హీరోయిన్ దీపికా ప‌దుకొణేను అయిదు గంట‌ల పాటు విచారించారు. అయితే దీపిక ఇచ్చిన స‌మాధానాల‌తో ఎన్సీబీ అధికారులు సంతృప్తి చెంద‌లేద‌ని తెలుస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో సంబంధం ఉన్న డ్ర‌గ్స్ కేసులో  ఎన్సీబీ విచార‌ణ చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇవాళ ఉద‌యం 9 గంట‌ల‌కు ఎన్సీబీ ఆఫీసుకు వ‌చ్చిన దీపిక‌ను అధికారులు ప‌లు కోణాల్లో విచారించారు.  ఆమె దాట‌వేత స‌మాధానాలు ఇచ్చిన‌ట్లు ప్రాథ‌మికంగా తెలుస్తోంది.  ఇంకా ఆమెకు ఈ కేసులో క్లీన్ చిట్ ఇవ్వ‌లేదు. మ‌రోసారి దీపిక‌ను ఈ కేసులో విచారించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఎన్సీబీ వ‌ర్గాలు వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది.  

డ్ర‌గ్స్ కేసులో మ‌రో న‌టి శ్ర‌ద్ధాక‌పూర్‌ను కూడా ఇవాళ ఎన్సీబీ విచారించింది.  డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని ఆమె విచార‌ణ‌లో వెల్ల‌డించింది. కానీ సుశాంత్ ఇచ్చిన ఫార్మ్‌హౌజ్ పార్టీకి మాత్రం హాజ‌రైన‌ట్లు ఆమె అంగీక‌రించింది. సీబీడీ ఆయిల్ గురించి జ‌య షాతో జ‌రిగిన చాటింగ్‌పై ఆమె ఎటువంటి స‌మాధానం ఇవ్వ‌లేదు. మ‌రో వైపు ఇదే కేసులో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ర‌విప్ర‌సాద్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. 



logo