దీపికా త‌ప్పించుకుంది..కానీ సారా అలీఖాన్

Sep 24, 2020 , 18:54:57

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరోయిన్లు దీపికా ప‌దుకొనే, సారా అలీఖాన్‌, శ్ర‌ద్దాక‌పూర్, ర‌కుల్ ప్రీత్ సింగ్ ల‌కు ఎన్సీబీ స‌మ‌న్లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం దీపికాపదుకొనేను విచారించ‌నుండ‌గా‌, శ‌నివారం సారా అలీఖాన్‌, శ్ర‌ద్దాక‌పూర్ విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. ఈ నేప‌థ్యంలో సారా అలీఖాన్‌, దీపికాప‌దుకొనే గోవా నుంచి ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చారు. వారి రాక‌తో మీడియా ప్ర‌తినిధుల‌తో ఎయిర్ పోర్టు కిక్కిరిసిపోయింది. దీపికా మాత్రం స్పెష‌ల్ చార్టెడ్ ఫ్లైట్ ఉంటంతో మీడియా కంట‌ప‌డ‌కుండా సుల‌భంగా వెళ్లిపోయింది. 

అయితే సారా అలీఖాన్ ను మీడియా రౌండ‌ప్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టంతో..సెక్యూరిటీ సిబ్బంది సారా, త‌ల్లి అమృతాసింగ్ ను బ‌య‌ట‌కు రానీయ‌లేదు. ఆ త‌ర్వాత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య అతిక‌ష్టం మీద‌ సారా, అమృతాతో క‌లిసి మీడియాకు దొర‌క‌కుండా కారులో ప‌య‌న‌మయ్యారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD