సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - May 31, 2020 , 22:53:21

ప్రభాస్‌ సరసన దీపిక?

ప్రభాస్‌ సరసన దీపిక?

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ (‘మహానటి’ ఫేమ్‌) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సోషియోఫాంటసీ కథాంశాన్ని ఎం చుకున్నట్లు సమాచారం.  ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ పాన్‌ఇండియా స్థాయిలో ఈ సినిమాకు రూపకల్పన చేస్తున్నారు. ఇందులో కథానాయికగా ఎవరు నటించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నాయికల పేర్లు తెరమీదకొస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో దీపికాపదుకునే కథానాయికగా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ వల్ల చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ సినిమా పూర్తయిన అనంతరం నాగ్‌అశ్విన్‌ దర్శకత్వం వహించే సినిమా సెట్స్‌మీదకు వెళ్తుందని చెబుతున్నారు.logo