సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 08, 2020 , 16:07:34

5 కోట్ల ఫాలోవ‌ర్స్‌.. మూడో ప్లేస్‌లో దీపిక‌

5 కోట్ల ఫాలోవ‌ర్స్‌.. మూడో ప్లేస్‌లో దీపిక‌

ఒక‌ప్పుడు సినిమాల ప‌రంగా సెల‌బ్రిటీల రేటింగ్ అంచ‌నా వేసేవారు. ఇప్పుడు కొత్త‌గా సామాజిక మాధ్య‌మాల విష‌యంలో సెల‌బ్రిటీల రేంజ్‌ని లెక్క‌లుగ‌డుతున్నారు. ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ప‌లు సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో యాక్టివ్‌గా ఉంటున్న సెల‌బ్రిటీలు త‌మ ప‌ర్స‌న‌ల్‌, సినిమా, ఈవెంట్స్‌, బ్రాండింగ్ ప్ర‌మోష‌న్ అంశాల‌ని షేర్ చేస్తూ ఉన్నారు. దీంతో వారిని ఫాలో అయ్యేవారి సంఖ్య  క్ర‌మేపి పెరుగుతూ పోతుంది. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఇటు బాలీవుడ్ అటు హాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని కూడా త‌న సినిమాల‌తో ఎంత‌గానో అల‌రించింది. సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు చాలా యాక్టివ్‌. త‌న పెళ్ళి స‌మ‌యంలో ఈ అమ్మ‌డు పెట్టిన పోస్ట్‌ల‌కి వేల కొల‌ది లైక్స్ వ‌చ్చాయి. స‌మాజంలో జ‌రిగే ప్ర‌తి విష‌యంపై త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా స్పందించే దీపికాకి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్స్ సంఖ్య‌  50 మిలియన్ల (5 కోట్లు)కి చేరింది.


ఇంత మంది  ఫాలోవర్లను సంపాదించుకున్న మూడో ఇండియన్‌గా దీపికానిలిచింది. ఇంత‌క ముందు విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా ఈ ఘ‌న‌త సాధించారు. అయితే త‌న‌ని ఫాలో అవుతున్న వారంద‌రికి దీపికా ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌తలు తెలిపింది

  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo