బుధవారం 03 జూన్ 2020
Cinema - May 19, 2020 , 16:40:34

ఐష్‌, దీపికా పదుకొనే డ్యాన్స్‌ వీడియో వైరల్‌

ఐష్‌, దీపికా పదుకొనే డ్యాన్స్‌ వీడియో వైరల్‌

ముంబై: బాలీవుడ్‌ నటి సోనమ్‌కపూర్‌, ఆనంద్‌ ఆహూజా పెళ్లి 2018లో గ్రాండ్‌ గా జరిగిన విషయం తెలిసిందే. సోనమ్‌ పెళ్లి వేడుకల్లో చాలా మంది బాలీవుడ్‌ సెలబ్రిటీలు సందడి చేశారు. వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో ఐశ్వర్యారాయ్‌, దీపికా పదుకొనే డ్యాన్స్‌ చేసినప్పటి వీడియో ఒకటి తాజాగా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. హిందీ మీడియం చిత్రంలోని ఇష్క్‌ తేరా తడ్‌పావే పాట ప్లే అవుతుండగా ఐశ్వర్యారాయ్‌, దీపికాపదుకొనే కలిసి స్టెప్పులేసి అదరగొట్టారు. వీరితోపాటు రన్‌వీర్‌ సింగ్‌, అభిషేక్‌ బచ్చన్‌, కరీశ్మాకపూర్‌ డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo