గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 18:02:39

డ్ర‌గ్స్ కేసు..దీపిక-కరిష్మా చాటింగ్‌

డ్ర‌గ్స్ కేసు..దీపిక-కరిష్మా చాటింగ్‌

నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు సోమవారం టాలెంట్ మేనేజర్‌ జయా సాహాను విచారించగా ప్రముఖ నటి దీపికా పడుకొనే పేరు తెరమీదకు వచ్చిన సంగ‌తి తెలిసిందే. జయ వాట్సాప్‌ చాట్‌ సమాచారాన్ని బట్టి దీపిక, ఆమె మేనేజర్‌ కరిష్మా డ్రగ్స్‌ గురించి ఆమెతో చర్చించినట్టు అధికారులు భావిస్తున్నారు. అందులో ఉన్న కోడ్‌ భాషలో ‘డీ’ అంటే దీపిక అని, ‘కే’ అంటే కరిష్మా అని ఎన్సీబీ అధికారులు అనుమానిస్తున్నారు. 2017 అక్టోబ‌ర్ 28న దీపిక, ఆమె మేనేజ‌ర్ మ‌ధ్య ఛాటింగ్ జ‌రిగిన‌ట్టు అధికారులు గుర్తించారు మాల్ కావాల‌ని దీపిక ఛాటింగ్ లో క‌రిష్మాను అడిగింది. మాల్ ఇంట్లో ఉంద‌ని, తాను వేరే చోట ఉన్నాన‌ని దీపిక బ‌దులిచ్చింది క‌రిష్మా. 

కోడ్ ఛాటింగ్ సాగిందిలా..

D ‌‌: మాల్ ఉందా..?

K‌‌: ఇంట్లో ఉంది. నేను బాంద్రాలో ఉన్నా..

K ‌‌:అమిత్ తో పంపించాలా..?

D ‌‌: ఎస్ ప్లీజ్‌, 

K ‌‌: అమిత్ తెస్తున్నాడు. 

D ‌‌: హ్యాష్ యేనా 

D ‌‌: వీడ్ కాదు

K ‌‌: కోకోకు ఏ టైంలో వ‌స్తావ్‌. 

D  ‌‌: రాత్రి 11.30 గంట‌ల‌కు లేదా 12 గంట‌ల‌కు వ‌స్తా. ఏం టైం వ‌ర‌కు ఉంటుంది. 

K  ‌‌: 11.30 వ‌ర‌కు ఉంటుంద‌ని చెప్పింది. 12 వ‌ర‌కు వేరే ప్లేస్ వెళ్లాలంది. 


logo