బుధవారం 27 మే 2020
Cinema - May 04, 2020 , 10:12:10

దీపికా ప‌దుకొణే త‌ల్లి కాబోతుందా ?

దీపికా ప‌దుకొణే త‌ల్లి కాబోతుందా ?

బాలీవుడ్ రొమాంటిక్ క‌పుల్ ర‌ణ్‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొణే వివాహం 2018 నవంబర్‌లో ఇటలీలోని లేక్ కోమోలో కొంకిణీ సంప్రదాయం ప్రకారం జరిగిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత ఈ ఆదర్శ దంపతులు తమకు దొరికిన హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తూ, వారి వారి ప్రాజెక్టుల‌ని పూర్తి చేస్తూ వ‌చ్చారు. అయితే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగి ఇంటికే ప‌రిమిత‌మైన ర‌ణ్‌వీర్ ఎక్కువ సేపు స‌మ‌యాన్ని నిద్ర‌కి కేటాయిస్తుండ‌గా, దీపికా త‌న భ‌ర్త కోసం వెరైటీ వంట‌కాలు నేర్చుకుంటుంది.

కొద్దిరోజులుగా దీపికా తాను చేసిన వంట‌ల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ వ‌స్తుంది. అయితే తాజాగా  దీపికా పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు అందర్ని ఆకర్షిస్తోంది.  మామిడి కాయ ముక్కలను కోసి ఉప్పుకారం చల్లి ఉన్న ఫోటోను షేర్ చేసింది దీపికా. ఇంకేముంది.. దీపికా తల్లి కాబోతున్నావా ?  శుభ‌వార్త ఎప్పుడు చెబుతున్నావ్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ర‌ణ్‌వీర్, దీపిక కలిసి గోలియోం కీ రాస్‌లీలా, రామ్-లీలా, 'ఫైండింగ్ ఫానీ', 'బాజీరావ్ మస్తానీ', 'పద్మావత్‌' లలో నటించారు.


logo