ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 13:09:25

ద‌ర్శ‌కురాలిగా మారిన హీరోయిన్

ద‌ర్శ‌కురాలిగా మారిన హీరోయిన్

సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ కుమార్ త‌నయ వ‌ర‌ల‌క్ష్మీ..  తండ్రికి త‌గ్గ త‌న‌య అనిపించుకుంటుంది. హీరోయిన్‌గాను, ప్ర‌తినాయ‌క పాత్ర‌ల‌లోను, స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లోను న‌టిస్తూ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి మెగా ఫోన్ ప‌ట్టింది. 

 తెన్నాండాల్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రామ‌స్వామి నిర్మాత‌గా 'కన్నామూచి'(దాగుడుమూతలు) అనే సినిమా రూపొందనుండ‌గా, ఈ సినిమాను వ‌ర‌ల‌క్ష్మీ తెర‌కెక్కిస్తున్నారు. స్త్రీ సాధికారతను తెలియజేసేలా 'ఇక్కడ చాలా ధైర్యవంతురాలైన మహిళ ఉంది. మనకు వారు తెలుసు, మనలోనే వారుండొచ్చు అలాంటి వారి గురించి బలంగా చెబుతాం' అని అంటూ... ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను తాప్సీ, లక్ష్మీమంచు, సమంత, ఐశ్వర్యా రాజేష్, సాయిపల్లవి, రాధికా శరత్‌కుమార్‌, జ్యోతిక, కీర్తిసురేష్‌, మంజిమ మోహన్‌, కాజల్‌ అగర్వాల్‌, రెజీనా కసండ్ర, శ్రద్ధా శ్రీనాథ్, అదితిరావు హైదరి, హన్సిక, సుహాసిని, సిమ్రాన్, చిన్మయి,త్రిష, అకరా హాసన్, ఆండ్రియా, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, సయేషా సైగల్, శృతిహాసన్ తదితరులు వారి ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ వరలక్ష్మి శరత్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఈ సినిమాతో కొత్త ప్ర‌యాణానికి శ్రీకారం చుట్టిన వ‌ర‌ల‌క్ష్మీ త‌ప్ప‌క విజ‌యం సాధిస్తుందని అభిమానులు విశ్వ‌సిస్తున్నారు. 


logo