సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 04, 2020 , 11:52:44

కరోనాతో ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు మృతి

కరోనాతో ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు మృతి

హైదరాబాద్‌ : దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరగడమే కాదు.. మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. సామాన్య ప్రజలు నుంచి సెలబ్రిటీ వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు (64) కరోనా బారిన పడి కన్నుమూశారు. ఇటీవల పోకూరి రామారావుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో గత కొన్నిరోజులుగా హైద‌రాబాద్ కాంటినెంట‌ల్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే క్రమంగా ఆయన ఆరోగ్య పరిస్థితి విష‌మించడంతో శనివారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ త‌రం ఫిలింస్ అధినేత పోకూరి బాబూరావు సోద‌రుడే పోకూరి రామారావు. ఈ త‌రం ఫిలింస్ బ్యాన‌ర్‌లో రూపొందిన పలు చిత్రాల‌కు ఆయన స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. పోకూరి రామారావు మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo