మేఘా ఆకాష్ , అరుణ్ ఆదిత్,అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో సుశాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం డియర్ మేఘ. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. భావోద్వేగాలు కలబోసిన అందమైన ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కగా, ఆగస్ట్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా డియర్ మేఘ టీజర్ విడుదల చేశారు. ‘హాయ్.. నేను మేఘ స్వరూప్. నాకు లవ్ లో పీహెడ్డీ ఉంది’ అంటూ మేఘా ఆకాష్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. టీజర్ చూస్తే ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మూవీ ఉంటుందని అర్ధం అవుతుంది. ‘లైఫ్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా బ్రతకడం కాదు.. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ బ్రతకడం’ ‘అతి ఎక్కువ సంతోషానికైనా బాధకైనా కారణం ప్రేమే అవుతుంది’ వంటి సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.. ఈ చిత్రానికి హరి గౌర సంగీతం సమకూర్చారు. ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు. టీజర్ సినిమాలపై ఆసక్తిని కలిగిస్తుంది.