గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 10:45:13

గుర్తు ప‌ట్టలేకుండా మారిన హీరోయిన్..!

గుర్తు ప‌ట్టలేకుండా మారిన హీరోయిన్..!

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ప్ర‌ముఖ హీరోయిన్ స‌మీరా రెడ్డి. న‌ర‌సింహుడు, అశోక్, కృష్ణం వందే జ‌గద్గురం వంటి తెలుగు చిత్రాల‌లో న‌టించిన ఈ అమ్మ‌డు పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు పూర్తి దూరంగా ఉంది. అయితే  హైదరాబాదీ భామ తాజాగా తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఓ వీడియోలో వివ‌రించింది. సినీ పరిశ్రమ వైకుంఠపాలి వంటిదని, త‌ప్ప‌టుడుగు వేస్తే పాము నోటికి చిక్కిన‌ట్టేన‌ని చెప్పుకొచ్చింది.

ముద్దు స‌న్నివేశం గురించి మాట్లాడుతూ.. ఇది స్క్రిప్ట్‌లో లేదు అని అడ‌గ‌గా, నిన్ను సినిమా నుండి తొల‌గించ‌డం క‌ష్టం కాదు అని అన్న‌ట్టు స‌మీరా చెప్పుకొచ్చింది. అలానే నాతో న‌టించ‌డం బోరింగ్ అని కూడా ఓ బాలీవుడ్ హీరో అన్నాడు. ఇలా ప‌లు విష‌యాల గురించి సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేసింది స‌మీరా. అయితే ఇవ‌న్నీ ఒక ఎత్తైతే స‌మీరాని చూసిన ఫ్యాన్స్ షాక‌య్యారు. తెల్ల‌టి వెంట్రుక‌ల‌తో అంద విహీనంగా క‌నిపించిన స‌మీరాని చూసి ఇలా మారిందేంట‌ని నోరెళ్ల పెడుతున్నారు.