ఆదివారం 31 మే 2020
Cinema - May 20, 2020 , 12:39:06

ప‌క్కా లోక‌ల్ సాంగ్‌తో ఎన్టీఆర్‌కి విషెస్ తెలిపిన వార్న‌ర్

ప‌క్కా లోక‌ల్ సాంగ్‌తో ఎన్టీఆర్‌కి విషెస్ తెలిపిన వార్న‌ర్

ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ కొద్ది రోజులుగా టిక్‌టాక్ వీడియోలు చేస్తూ నెటిజ‌న్స్‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ద‌క్షిణాది భాష‌ల‌కి సంబంధించిన పాట‌లు లేదా డైలాగ్స్‌ని వార్న‌ర్ ఎంచుకొని టిక్‌టాక్ వీడియోలు చేస్తుండ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. తాజాగా ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న పాట‌కి టిక్‌టాక్ వీడియో చేసి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలిపారు

జ‌న‌తా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్, కాజ‌ల్ అగ‌ర్వాల్‌లు ప‌క్కా లోక‌ల్ అనే సాంగ్‌కి మాస్ స్టెప్స్ వేసి ప్రేక్ష‌కుల‌ని ఎంతో థ్రిల్ చేశారు. ఇప్పుడిదే సాంగ్‌కి డేవిడ్ వార్న‌ర్ త‌న భార్య‌తో క‌లిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోని త‌న సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. హ్యాపీ బ‌ర్త్ డే ఎన్టీఆర్ అని శుభాకాంక్ష‌లు తెలిపారు. ప‌క్కా లోక‌ల్ సాంగ్‌కి వార్న‌ర్ వేసిన డ్యాన్స్ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

తతాను మించిన మనవడు.. నవరస నటసార్వభౌముడు.. తారక్‌logo