ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గత ఏడాది లాక్డౌన్ నుండి నెటిజన్స్‌కు మంచి వినోదం పంచుతున్న విషయం తెలిసిందే. తన సోషల్ మీడియా ద్వారా పలు సినిమాలోని పాటలు, డైలాగ్స్‌కు సంబంధించి వీడియోలు షేర్ చేస్తూ వస్తున్నాడు. ఇటీవల స్వాప్ వీడియోలు ఎక్కువగా షేర్ చేస్తుండగా, తాజాగా టైగర్ ష్రాప్ నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలోని పాటకు స్టెప్పులేశాడు.
స్వాపింగ్ యాప్‌తో టైగర్ ష్రాఫ్ ముఖానికి బదులుగా తన ముఖాన్ని స్వాప్ చేసి వీడియోను రిలీజ్ చేశాడు. ఇందులో అలియాతో కలిసి అదిరిపోయే స్టెప్పులేస్తున్నట్టు కనిపించాడు. ఇదంతా నా అభిమానుల కోరిక మేరకు చేశాను అని పేర్కొన్నాడు వార్నర్. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. ఇటీవల ఐపీఎల్ కోసం ఇండియాకు వచ్చిన వార్నర్ టోర్నీ రద్ధు కావడంతో ఆస్ట్రేలియాకు వెళ్లారు. కొన్ని రోజుల క్వారంటైన్ తర్వాత తన ఫ్యామిలీని కలుసుకొని ఎమోషనల్ అయ్యారు.