శనివారం 11 జూలై 2020
Cinema - May 25, 2020 , 11:56:13

మ‌రో ఫన్నీ టిక్‌టాక్ వీడియోతో వ‌చ్చిన డేవిడ్ వార్న‌ర్

మ‌రో ఫన్నీ టిక్‌టాక్ వీడియోతో వ‌చ్చిన డేవిడ్ వార్న‌ర్

లాక్‌డౌన్‌కి ముందు క్రికెట్ గ్రౌండ్‌లో దుమ్ము రేపిన  డేవిడ్ వార్న‌ర్ ప్ర‌స్తుతం టిక్ టాక్ వీడియోల‌తో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాడు. తెలుగు, హిందీ, త‌మిళం ఇలా ప‌లు భాష‌ల‌కి సంబంధించిన సాంగ్స్‌, డైలాగ్స్‌కి ప‌లు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ అల‌రిస్తున్నాడు.

తాజాగా స‌రిలేరు నీకెవ్వ‌రు అనే చిత్రంలోని మైండ్ బ్లాక్ అనే సాంగ్‌లో  వాడిని కొట్ట‌మ‌ని చెప్పు లిరిక్‌కి టిక్ టాక్ వీడియో చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేస్తున్న‌ట్టు ఫోజిచ్చిన వార్న‌ర్ త‌ర్వాత మాయ‌మైపోతాడు. ఇది నా షాడో బ్యాటింగ్, ఇంట్లో భార్య ,పిల్లలు ఉండటం మీరు విన్నారు కదా, మళ్ళీ కలుద్దాం  అని త‌న వీడియోకి కామెంట్ పెట్టాడు.   ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కు కెప్టెన్‌ గా ఉన్న వార్న‌ర్ ఇప్ప‌టికే తెలుగులోని పలు సాంగ్స్‌కి టిక్ టాక్ వీడియోలు చేయ‌గా, వాటికి తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఫిదా అయ్యారు.


logo