శనివారం 30 మే 2020
Cinema - May 12, 2020 , 16:41:57

ఈ సారి రాములో రాములా.. సాంగ్‌తో ర‌చ్చ చేసిన డేవిడ్ వార్న‌ర్

ఈ సారి రాములో రాములా.. సాంగ్‌తో ర‌చ్చ చేసిన డేవిడ్ వార్న‌ర్

లాక్‌డౌన్ స‌మ‌యంలో నెటిజ‌న్స్‌కి మాంచి ఎంట‌ర్‌టైనర్ అందిస్తున్నారు ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్.  తెలుగు సినిమాలకి సంబంధించిన సాంగ్స్‌, డైలాగ్స్‌తో ఎక్కువ టిక్ టాక్ వీడియోలు చేస్తూ వ‌స్తున్న వార్న‌ర్ తాజాగా అల వైకుంఠ‌పుర‌ములోని రాములో రాములా సాంగ్‌కి ఫ్యామిలీతో క‌లిసి డ్యాన్స్ చేశారు. ముందు వరుసలో వార్నర్‌-కాండీస్‌లు జంటగా అచ్చం అల్లు అర్జున్ మాదిరి స్టెప్పులేయగా... వెనుకాల ఇండిరే ఇరగదీసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో కూడా వైరల్‌గా మారింది.

బుట్ట బొమ్మ, సన్నజాజి సాంగ్, పోకిరి డైలాగ్‌కి టిక్ టాక్ వీడియోలు చేసి వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారాయి. సౌత్ ప్రేక్ష‌కులు వార్న‌ర్ న‌ట‌న‌తో పాటు డ్యాన్స్‌ల‌కి ఫిదా అవుతున్నారు. పూరీ జ‌గ‌న్నాథ్ అయితే వార్న‌ర్ న‌ట‌నకి ఫ్లాట్ అయి త‌న సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయాల‌ని కోరాడు. క్రికెట్ లేక‌పోవ‌డంతో టిక్‌టాక్‌తో కాల‌క్షేపం చేస్తున్న వార్న‌ర్ గ్యాంగ్ రానున్న రోజుల‌లో ఏఏ సాంగ్స్‌తో అలరిస్తుందో చూడాలి .logo