సోమవారం 01 జూన్ 2020
Cinema - May 09, 2020 , 13:21:56

త‌మిళ్ సాంగ్‌కి డేవిడ్ వార్న‌ర్ టిక్ టాక్ వీడియో

త‌మిళ్ సాంగ్‌కి డేవిడ్ వార్న‌ర్ టిక్ టాక్ వీడియో

ఆస్ట్రేలియా స్టార్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని త‌న ఫ్యామిలీతో క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతున్నాడు. మ‌రోవైపు త‌న శ్రీమ‌తితో క‌లిసి టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఫ్యాన్స్‌కి థ్రిల్ క‌లిగిస్తున్నాడు. ఇటీవ‌ల అల వైకుంఠ‌పుర‌ములోని బుట్ట‌బొమ్మ సాంగ్‌కి టిక్ టాక్ వీడియో చేసిన వార్న‌ర్ తాజాగా త‌మిళ సాంగ్‌కి సంబంధించిన మ్యూజిక్‌కి స్టెప్పులు వేశారు.

త‌న భార్య క్యాండీస్ కూతురు ఇండీతో క‌లిసి 33 ఏళ్ల వార్న‌ర్ చేసిన టిక్ టాక్ వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇంట్లో బోర్ కొడుతున్న నేప‌థ్యంలో తాము టిక్ టాక్ వీడియోలు చేస్తున్నట్టు వార్న‌ర్ పేర్కొన్నారు.  అయితే వార్న‌ర్ వీడియోకి ఫుల్ రెస్పాన్స్ వ‌స్తుంది. త‌మిళ నాడు బ్ర‌ద‌ర్ ల‌వ్ యూ అని ఒక‌రు కామెంట్ చేయ‌గా, చాలా అద్భుతంగా చేశావు అని మ‌రొక‌రు కామెంట్ చేశారు. ఇలాంటి స‌మ‌యంలో క్రికెట‌ర్ మాత్ర‌మే మ‌న‌ల్ని న‌వ్వించ‌గ‌ల‌రని ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు. మొత్తానికి వార్న‌ర్ గ్రౌండ్‌లోనే కాదు సోష‌ల్ మీడియాలోను త‌న డ్యాన్స్‌ల‌తో దుమ్ము రేపుతున్నాడు.logo