కీర్తి సురేష్ (Keerthy Suresh) కు అప్పుడే అంత పెద్ద బిరుదు ఇచ్చేస్తున్నారేంటబ్బా అనుకుంటున్నారా..? ఈమె చేస్తున్న పనులు..తీసుకుంటున్న నిర్ణయాలు చూసిన తర్వాత ఇదే అనిపిస్తుంది మరి. స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న సమయంలో చెల్లెలిగా నటించడం అంటే అంతకంటే సాహసం మరోటి లేదు. ఎందుకంటే మన దగ్గర ఒక్కసారి చెల్లి అయ్యారంటే చాలు..వరసగా అలాంటి పాత్రలే వస్తుంటాయి. అందుకే స్టార్ హీరోయిన్స్ ఎవరూ చెల్లి పాత్రల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు. అక్కడ ఎంత పెద్ద హీరో ఉన్నా కూడా చెల్లి పాత్ర అంటే నో అనేస్తుంటారు.
అలాంటిది ఇప్పుడు కీర్తి సురేష్ తన స్టార్ ఇమేజ్ పక్కనబెట్టి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కు చెల్లి అయిపోయింది. వేదాళం రీమేక్ భోళా శంకర్ (Bhola Shankar) సినిమాలో కీర్తి చెల్లి పాత్రలో నటిస్తుంది. ఇన్ని రోజులు దీనిపై కేవలం వార్తలు మాత్రమే వచ్చేవి.. ఇప్పుడు క్లారిటీ కూడా వచ్చింది. తమ సినిమాలో కీర్తి నటిస్తుందంటూ అఫీషియల్ గా ప్రకటించారు దర్శక నిర్మాతలు. మెహర్ రమేష్ తెరకెక్కించబోయే ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.
తమిళనాట అజిత్ హీరోగా శివ తెరకెక్కించిన వేదాళం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో భోళా శంకర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకుడు అనగానే మెగా ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నా కూడా అంతా తానేయై నడిపించడానికి రెడీ అవుతున్నాడు మెగాస్టార్. ముఖ్యంగా ఇందులో కీర్తి సురేష్ చెల్లిగా నటిస్తుండటంతో అంచనాలు కూడా పెరిగిపోయాయి. తమిళనాట ఈ పాత్రలో లక్ష్మీ మీనన్ నటించింది. ఇదిలా ఉంటే కీర్తి ఇలాంటి డేరింగ్ నిర్ణయాలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. స్టార్ హీరోలతో వరస అవకాశాలు వస్తున్న సమయంలోనే మహానటి లాంటి సినిమాకు ఓకే చెప్పింది.
సావిత్రి పాత్ర కోసం బరువు పెరగడమే కాకుండా చాలా రిస్క్ తీసుకుంది. అందుకే ఆ పాత్రకు ఏకంగా జాతీయ అవార్డునే సొంతం చేసుకుంది కీర్తి. ఏదేమైనా కూడా చాలా తక్కువ కెరీర్ లోనే వీలైనన్ని ప్రయోగాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే సక్సెస్ తో పాటు గుర్తింపు కూడా అలాగే వస్తుంది.
ఇవికూడా చదవండి..
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!