శనివారం 04 జూలై 2020
Cinema - Jul 01, 2020 , 08:05:59

ఫ్రాన్స్‌లో సంద‌డి చేయ‌నున్న ర‌జ‌నీకాంత్ ద‌ర్భార్

ఫ్రాన్స్‌లో సంద‌డి చేయ‌నున్న ర‌జ‌నీకాంత్ ద‌ర్భార్

క‌రోనా ఎఫెక్ట్‌తో ప‌రిస్థితులన్నీ మారిపోయాయి. గ‌త మూడు నెల‌లుగా ప్రపంచంలో ఎక్క‌డ కూడా షూటింగ్స్ జ‌ర‌గ‌లేదు. థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. వినోద ప‌రిశ్ర‌మ పూర్తిగా స్తంభించింది. కొన్ని చోట్ల‌ ఇప్పుడిప్పుడే కాస్త ప‌రిస్థితులు కుదుట‌ప‌డుతుండ‌డంతో షూటింగ్స్ జ‌రుపుతున్నారు. థియేట‌ర్స్‌ని తిరిగి తెరుస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం రిలీజ్‌కి సినిమాలు సిద్ధంగా లేక‌పోవ‌డంతో క్రేజ్ ఉన్న సినిమాల‌ని రీరిలీజ్ చేస్తున్నారు.

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కి ప్ర‌పంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న న‌టించిన ప్ర‌తి చిత్రం విదేశాల‌లో విడుద‌లవుతూ ఉంటుంది. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జనీకాంత్‌, న‌య‌న‌తార‌, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ద‌ర్భార్ చిత్రం ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ఈ చిత్రాన్ని ఫ్రాన్స్‌లో మ‌రోసారి రిలీజ్ చేస్తున్నారు. జూలై 1 నుండి ద‌ర్భార్ చిత్రాన్ని రీరిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ విష‌యం తెలుసుకున్న త‌లైవా ఫ్యాన్స్ త‌మ అభిమాన హీరో యాక్ష‌న్‌ని మ‌రోసారి వెండితెర‌పై చూసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.


logo