బుధవారం 03 జూన్ 2020
Cinema - May 15, 2020 , 12:28:55

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌.. మే 20న ర‌చ్చ‌రంబోలానే!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌.. మే 20న ర‌చ్చ‌రంబోలానే!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న విడుద‌ల అవుతుంద‌ని ఫ్యాన్స్ భావించారు. కాని లాక్‌డౌన్ వ‌ల‌న అది సాధ్యం కాక‌పోవ‌చ్చు అని నిర్మాత దాన‌య్య  రీసెంట్‌గా ప్ర‌క‌టించారు. దీంతో ప్రేక్ష‌కులు డీలా ప‌డ్డారు.

అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు వ‌చ్చేలా రాజ‌మౌళి మే 20న (ఎన్టీఆర్ బ‌ర్త్‌డే) ఓ  స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ సిద్ధం చేశాడట‌. ఇప్పటి వ‌ర‌కు ఈ వార్త ఎలాంటి క్లారిటీ లేక‌పోగా, తాజాగా దాన‌య్య క‌న్‌ఫాం చేశారు. ఎన్టీఆర్‌ని ప‌రిచ‌యం చేస్తూ ఉండే ఈ వీడియో ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా,  రామ్‌చరణ్‌ బర్త్‌డే సందర్భంగా ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో  ‘బీమ్‌ ఫర్‌ రామరాజు’ పేరిట చరణ్‌ పాత్రకు సంబంధించి విడుద‌లైన టీజ‌ర్‌కి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆర్ఆర్ఆర్ అనే  భారీ బడ్జెట్‌ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగతమందిస్తున్నారు. అలియా భట్, అజయ్ దేవగణ్, పి సముద్రఖని, రే స్టీవెన్సన్‌, ఓలివియా మోరీస్ ముఖ్య పాత్ర‌ల‌లో‌ నటిస్తున్నారు. అలియా భట్, అజయ్ దేవగణ్, పి సముద్రఖని, రే స్టీవెన్సన్‌, ఓలివియా మోరీస్ ముఖ్య పాత్ర‌ల‌లో‌ నటిస్తున్నారు.


logo