మంగళవారం 26 మే 2020
Cinema - May 13, 2020 , 22:45:28

డిసెంబర్‌లో రానా పెళ్లి

డిసెంబర్‌లో రానా పెళ్లి

తనకు కాబోయే శ్రీమతి మిహీక బజాజ్‌ను మంగళవారం సోషల్‌మీడియా ద్వారా పరిచయం చేశారు హీరో రానా. మిహీకతో తాను కలిసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన రానా ‘తను అంగీకారం తెలిపింది ’ అని ప్రేమ గురించి వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచారు. రానా, మిహీక జంటకు టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులంతా శుభాకాంక్షలందజేసున్నారు. తనయుడి  ప్రేమాయణం, పెళ్లిపై  రానా తండ్రి సురేష్‌బాబు స్పందించారు. రానా వివాహాన్ని డిసెంబర్‌లో  జరుపనున్నట్లు  ఆయన తెలిపారు.  ‘రానా, మిహీకబజాజ్‌ మధ్య చాలా కాలంగా పరిచయముంది. వారి నిర్ణయం పట్ల మా కుటుంబమంతా సంతోషంగా ఉంది.  డిసెంబర్‌లో రానా  పెళ్లి చేయాలని అనుకుంటున్నాం. అంతకంటే ముందుగానే వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకుంటూ  పెళ్లి ఏర్పాట్లను ప్లాన్‌ చేస్తున్నాం.  సరైన సమయం వచ్చినపుడు ఆ వివరాల్ని వెల్లడిస్తాం’ అని తెలిపారు.  logo