గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 16:52:40

ఎన్టీఆర్ క్యాలెండ‌ర్ షూట్‌..త్రోబ్యాక్ స్టిల్ వైర‌ల్

ఎన్టీఆర్ క్యాలెండ‌ర్ షూట్‌..త్రోబ్యాక్ స్టిల్ వైర‌ల్

టాలీవుడ్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన అర‌వింద స‌మేత చిత్రం కోసం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ లో మెరిశాడు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ అదే లుక్ ను కొన‌సాగిస్తున్నాడు. రాజ‌మౌళి డైరెక్ష‌న్ లో వ‌స్తోన్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కూడిన ఇదే లుక్ లో క‌నిపించ‌నున్నాడు‌. అయితే తార‌క్ ఈ 2 చిత్రాల మ‌ధ్య‌లో డ‌బూ ర‌త్నాని 2020 క్యాలెండ‌ర్  షూట్ లో పాల్గొన్నాడు. వైట్ ప్యాంట్ వేసుకున్న ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లో సూప‌ర్ ఫిట్ గా క‌నిపిస్తున్న త్రోబ్యాక్ ఫొటోను డ‌బూ ర‌త్నాని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయ‌గా..ఎన్టీఆర్ లుక్ నెటిజ‌న్లు, ఫాలోవ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటోంది.

ఆర్ఆర్ఆర్ టీం నుంచి భీమ్ కోసం రామ‌రాజు స్పెష‌ల్ టీజ‌ర్ ను వ‌చ్చే వారంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌నుండ‌గా..అలియాభ‌ట్ సీత పాత్ర‌లో న‌టించ‌నుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo