శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Cinema - Jun 16, 2020 , 16:52:36

స‌ల్మాన్, ఆయ‌న కుటుంబం నా కెరీర్‌ని నాశనం చేశారు...

స‌ల్మాన్, ఆయ‌న కుటుంబం నా కెరీర్‌ని నాశనం చేశారు...

సుశాంత్ సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత న‌ట వార‌స‌త్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. గతంలో నెపోటిజం ద్వారా ఇబ్బందులు ప‌డ్డ న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు ఒక్కొక్క‌రు త‌మ‌కి ఎదురైన ఇబ్బందుల‌పై నోరు విప్పుతున్నారు. ఇప్ప‌టికే కంగ‌నా ర‌నౌత్‌తో పాటు ప‌లువురు దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా, తాజ‌గా  బాలీవుడ్‌ దర్శకుడు అభినవ్‌ కశ్యప్‌ పలు సంచలన ఆరోపణలు చేశారు. 

2010లో స‌ల్మాన్ ఖాన్ న‌టించిన ద‌బాంగ్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అభిన‌వ్‌.. ఈ సినిమాకి కూడా సీక్వెల్ చేయాల‌ని భావించాడు. కాని స‌ల్మాన్ సొద‌రులు  అర్బాజ్, సోహైల్ ఖాన్‌ల వ‌ల‌న అది జ‌ర‌గ‌లేద‌ని చెప్పుకొచ్చాడు అభిన‌వ్. నా కెరీర్‌ని నాశ‌నం చేయాల‌ని వారు భావించారు. బెదిరింపుల‌కి దిగారు. 2013లో నేను చేసిన బేషారం అనే చిత్రాన్ని ఆపేందుకు వారు ఎంత‌గానో ప్ర‌య‌త్నించారు.  నా శత్రువులు సలీం ఖాన్, సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్. మేనేజ‌ర్‌లు వారికంటూ ప్ర‌త్యేక జీవితాన్ని ఏర్ప‌ర‌చుకోరు. ఇత‌రుల జీవితాన్ని భ‌విష్య‌త్‌ని నాశ‌నం చేస్తారు అని త‌న ఫేస్ బుక్ పోస్ట్‌లో రాసారు అభిన‌వ్ .

అభిన‌వ్ క‌శ్య‌ప్ సోద‌రుడు అనురాగ్ క‌శ్య‌ప్ ఈ వివాదంపై స్పందిస్తూ..రెండు సంవత్సరాల క్రితం, అభినవ్ తన వ్యాపారానికి దూరంగా ఉండమని నాకు స్పష్టంగా చెప్పాడు . అతని వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు నేను ఏం మాట్ల‌డ‌లేను అని పేర్కొన్నారు


logo