మంగళవారం 07 జూలై 2020
Cinema - May 10, 2020 , 17:25:51

ఎన్టీఆర్ యాక్ష‌న్‌కి సుధీర్ బాబు డైలాగ్‌.. అదిరిపోలా!

ఎన్టీఆర్ యాక్ష‌న్‌కి సుధీర్ బాబు డైలాగ్‌.. అదిరిపోలా!

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారకరామారావు న‌టించిన దాన‌వీర‌శూర‌క‌ర్ణ చిత్రంలోని ఏమంటి వేమంటివి అనే ప‌వర్ ఫుల్‌ డైలాగ్ ప్ర‌తి ఒక్క‌రికి గుర్తుండే ఉంటుంది. ఈ డైలాగ్‌ని ఎంతో మంది ఎన్టీఆర్ స్టైల్‌లో చెప్పాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అంత‌గా అల‌రించ‌లేక‌పోయార‌నే చెప్ప‌వ‌చ్చు. తాజాగా ప్రముఖ న‌టుడు సుధీర్ బాబు సేమ్ డైలాగ్‌ని త‌న‌దైన స్టైల్‌లో చెప్పారు.

లాక్ డౌన్ కార‌ణంగా ఇంటికి ప‌రిమిత‌మైన సుధీర్ బాబు రెగ్యుల‌ర్‌గా ఫిట్‌నెస్‌కి సంబంధించిన ఆస‌నాలు చేయ‌డంతో పాటు మ‌ధ్య మ‌ధ్య‌లో డ‌బ్ స్మాష్‌లు కూడా ట్రై చేస్తున్నారు. తాజాగా దాన‌వీర‌శూర‌క‌ర్ణ చిత్రంలోని ఏమంటి వేమంటివి అనే డైలాగ్‌ని ఎన్టీఆర్ చెప్పిన మాదిరిగానే, అవే హావభావాలతో, ఒకే టైమింగ్‌తో చెప్పి నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

 


logo