టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్టు పుష్ప (Pushpa). సుకుమార్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక
(DaakkoDaakkoMeka) సాంగ్ ఇంట్రడక్షన్ వీడియో ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఆగస్టు 13న లిరికల్ సాంగ్ విడుదల కానుండగా..తాజాగా మేకర్స్ దాక్కో దాక్కో మేక సాంగ్ కు సంబంధించిన మరో వీడియోను విడుదల చేశారు.
డీఎస్పీ ఎంట్రీ..ఆ తర్వాత పుష్పరాజ్ అండ్ గ్యాంగ్ తో సాగుతున్న ఈ సాంగ్ వీడియో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న దాక్కో దాక్కో మేక తాజా వీడియోపై మీరూ లుక్కేయండి మరీ. ఈ పాటను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఐదుగురు సింగర్స్ పాడారు. తెలుగులో శివం పాటను పాడారు. రెండు పార్టులుగా వస్తున్న పుష్ప చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్.
ఇవి కూడా చదవండి..
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
శృతి హాసMahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?