అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్ స్పీడ్ పెంచిన మేకర్స్ శుక్రవారం ‘దాక్కో దాక్కో మేక..’ పాట విడుదల చేశారు. ఈ సాంగ్‌ని హిందీలో విశాల్ దడ్లాని, కన్నడలో విజయ్ ప్రకాశ్, మలయాళంలో రాహుల్ నంబియార్,తెలుగులో శివం,తమిళంలో బెన్నీ దయాల్ ఆలపించారు.
తెలుగులో దాక్కో దాక్కో మేక అనే లిరిక్స్‌తో ఈ పాటని చంద్రబోస్ రాయగా, దానికి తగ్గటు దేవీశ్రీ స్పెషల్ బీట్ అందించాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవి బతకడం కోసం మరో జీవిని చంపక తప్పదు అనే అర్థం చెప్పేలా అద్భుత లిరిక్స్ అందించాడు చంద్రబోస్. పుష్పరాజ్ పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా, సినిమా కథలోని మూల విషయాన్ని చెప్పేలా ఈ సాంగ్‌ని రచించినట్టు చంద్రబోస్ చెప్పారు.
24 గంటల్లోఈ పాట ఆల్ టైం రికార్డు రియల్ టైం వ్యూస్ సాధించింది. 9.4 మిలియన్ వ్యూస్ మరియు 6 లక్షల 57 వేల ఆల్ టైం రికార్డ్స్ రెండిటిని సెట్ చేసి తెలుగు ఇండస్ట్రీలో రికార్డుల మోత మోగిస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ వీడియో రికార్డులు క్రియేట్ చేయగా, ఇప్పుడు పాట కూడా మోతమోగిస్తుంది. రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా వాటిలో మొదటి పార్ట్ “పుష్ప ది రైజ్” పేరుతో రూపొందుతుంది.