శనివారం 30 మే 2020
Cinema - Apr 30, 2020 , 13:59:19

వైర‌ల్‌గా మారిన ఇర్ఫాన్‌, రిషీ 'డీ-డే' మూవీ క్లిప్

వైర‌ల్‌గా మారిన ఇర్ఫాన్‌, రిషీ 'డీ-డే' మూవీ క్లిప్

ఒకే రోజు గ్యాప్‌తో భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన రెండు ఆణిముత్యాలు నేల‌రాలాయి. క‌రోనా సంక్షోభంలో ఉన్న మ‌న‌కి ఇద్ద‌రి మ‌ర‌ణాలు తీవ్ర మ‌నోవేద‌న‌ని క‌లిగించాయి. గొప్ప న‌టుడు ఇర్ఫాన్ మ‌ర‌ణించి ఒక్క రోజు కూడా గ‌డ‌వక ముందే రిషీ క‌పూర్ మ‌ర‌ణ వార్త వినాల్సి రావ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఇర్ఫాన్, రిషీ క‌పూర్‌లు ఇలా హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డం భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు.

ఇర్ఫాన్ మృతి చెందాడ‌నే వార్త విని మిలియ‌న్ల ప్రజ‌ల గుండెలు ప‌గిలిపోగా, తెల్లారే రిషీ క‌పూర్ మ‌ర‌ణ వార్త విన‌డంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లు శోక సంద్రంలో మునిగారు. అయితే వీరిద్ద‌రి ప‌విత్ర ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని రాజ‌కీయ నాయ‌కులు, క్రీడా ప్ర‌ముఖులు, సినీ సెల‌బ్రిటీలు దేవుడిని ప్రార్ధించారు. కొంద‌రు ఇద్ద‌రు క‌లిసి న‌టించిన డీ-డే సినిమాలోని క్లిప్‌ని షేర్ చేస్తూ సంతాపం ప్ర‌క‌టించారు. ఈ ఫోటోని చూస్తుంటే రోమాలు నిక్క‌పొడుచుకుంటున్నాయి అని కామెంట్ చేస్తున్నారు. 2013లో నిఖిల్ అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన డీ డే చిత్రంలో ఇర్ఫాన్, అర్జున్ రాంపాల్‌, హుమా ఖురేషీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా, రిషీ క‌పూర్ ముఖ్య పాత్ర పోషించారు. ‌


logo