సోమవారం 06 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 18:34:08

సైక్లోన్ అంత ఫ్రెండ్లీ ఏం కాదు: ట్వింకిల్ ఖన్నా

సైక్లోన్ అంత ఫ్రెండ్లీ ఏం కాదు: ట్వింకిల్ ఖన్నా

ముంబై: మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో నిసర్గ తుఫాను తీరాన్ని తాకడంతో బలమైన ఈదులు గాలులు వీస్తున్న విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా తనదైన శైలిలో స్పందించారు. సైక్లోన్ అంత స్నేహపూర్వకమైనదేమి కాదని ప్రజలకు సూచించారు.

అయితే బీచ్ లో తాను మాత్రం టీ కప్పుతో సైక్లోన్ ధాటికి అలలు వస్తాయేమోనని ఎదురుచూస్తున్నానని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. నిసర్గ తుపాన్ వచ్చి హగ్ ఇవ్వాలనుకుంటోంది. అందరూ ఇంట్లో ఉండి..సురక్షితంగా ఉండండి అని ప్రజలు, అభిమానులను కోరారు.  ఇప్పటికే అక్షయ్ కుమార్ సైక్లోన్ నిసర్గ హెచ్చరికల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు. 


logo