శనివారం 28 నవంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 00:17:16

క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ప్రత్యర్థి’

క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ప్రత్యర్థి’

రవివర్మ, వంశీ, రోహిత్‌ బెహల్‌, అక్షిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ప్రత్యర్థి’ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పాలు డ్రీమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శంకర్‌ ముడావత్‌ దర్శకత్వంలో సంజయ్‌షా నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్‌ కందుకూరి క్లాప్‌నివ్వగా, నాగర్‌కర్నూల్‌ శాసనసభ్యుడు మర్రి జనార్ధన్‌రెడ్డి కెమెరా స్విఛాన్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో సాగే పరిశోధనాత్మక చిత్రమిది. టైటిల్‌కు తగినట్టే కథ ఆసక్తికరంగా ఉంటుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథ, కథనాలతో ఆకట్టుకుంటుంది’ అన్నారు. ‘శనివారం నుంచి డిసెంబర్‌ 4వరకు ఫస్ట్‌ షెడ్యూల్‌ జరుగుతుంది. అనంతరం జనవరి నెలాఖరు వరకు జరిగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది’ అని నిర్మాత తెలిపారు.  ఈ సినిమా కాన్సెప్ట్‌ బాగా నచ్చిందని నటుడు రవివర్మ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రాకేష్‌ గౌడ్‌, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, రచన-దర్శకత్వం: శంకర్‌ ముడావత్‌.