క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఫ్రెండ్షిప్’. జాన్‌పాల్‌రాజ్-శ్యామ్సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఏ.ఎన్ బాలాజీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లోస్లియా కథానాయికగా నటిస్తోంది. హర్భజన్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ‘అరిచి అరగదీయమ్మ’ అనే పాటను ఇటీవల విడుదలచేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘స్నేహం, ప్రేమ అంశాల నేపథ్యంలో సాగే చిత్రమిది. హర్భజన్‌సింగ్ పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. నటుడిగా అతడికి చక్కటి శుభారాంభాన్ని అందిస్తుంది. త్వరలో రామోజీఫిలింసిటీలో పాట, ఫైట్‌ను చిత్రీకరిస్తాం. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది’ అన్నారు. అర్జున్, సతీష్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్‌కుమార్.