శుక్రవారం 29 మే 2020
Cinema - May 19, 2020 , 12:22:55

కేజీఎఫ్ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ సినిమా.. ఏడాది కాల్షీట్స్ కేటాయింపు

కేజీఎఫ్ డైరెక్ట‌ర్‌తో ఎన్టీఆర్ సినిమా.. ఏడాది కాల్షీట్స్ కేటాయింపు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కొమురం భీంగా క‌నిపించి అల‌రించ‌నున్నాడు. ఇక ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ తో క‌లిసి ఓ ప్రాజెక్ట్‌ చేయ‌నుండ‌గా, వీలైనంత తొంద‌ర‌గా సినిమాని పూర్తి చేయాల‌ని జూనియ‌ర్ భావిస్తున్నాడు. 

ఎన్టీఆర్- ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో పాన్ ఇండియా సినిమా రూపొంద‌నుంద‌ని కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో చిత్రానికి సంబంధించి మేజ‌ర్ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏడాది పాటు బ‌ల్క్‌గా కాల్షీట్స్ కేటాయించాడ‌ని అంటున్నారు. ఇందులో ఎంత నిజ‌ముంద‌నేది చూడాలి. మే 20న ఎన్టీఆర్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఆ రోజు ఎన్టీఆర్ సినిమాల‌కి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్టు తెలుస్తుంది.


logo