ఆదివారం 31 మే 2020
Cinema - May 21, 2020 , 09:37:45

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ సినిమాకి వెరైటీ టైటిల్‌..!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ సినిమాకి వెరైటీ టైటిల్‌..!

విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ‘ఫైటర్‌ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో యాక్షన్‌ హంగులతో పాటు కంటతడి పెట్టించే భావోద్వేగభరిత సన్నివేశాలుంటాయట‌. పాన్‌ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా కనిపించబోతున్నారు .యాక్షన్‌, ఫైట్స్‌ మాత్రమే కాదు. మదర్‌సెంటిమెంట్‌ ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది. విజయ్‌, రమ్యకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు హృద్యంగా ఉంటాయి. 

లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర నిర్మాణంలో ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌జోహార్‌ ఓ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. అతి త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది. మూవీకి మ‌రింత క్రేజ్ తీసుకొచ్చేందుకు లిగ‌ర్ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నార‌ట‌. లిగ‌ర్ అంటే మ‌గ సింహంకి, ఆడ పులికి పుట్టిన క్రాస్ బ్రీడ్. లిగ‌ర్ సౌండింగ్ డిఫ‌రెంట్‌గా ఉండ‌డంతో పాటు ఇంట్రెస్టింగ్‌గా ఉన్న నేప‌థ్యంలో పూరీ జ‌గ‌న్నాథ్ ఇదే టైటిల్‌ని ఫైన‌ల్ చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలుస్తుంది.  బాలీవుడ్ భామ‌ అన‌న్య పాండే చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.


logo