మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 20, 2020 , 13:34:14

బిగ్ బాస్ ఫినాలే డేట్ ఫిక్స్ .. చీఫ్ గెస్ట్‌గా ఎవ‌రో తెలుసా?

బిగ్ బాస్ ఫినాలే డేట్ ఫిక్స్ .. చీఫ్ గెస్ట్‌గా ఎవ‌రో తెలుసా?

అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగులో సీజన్ 4 జ‌రుపుకుంటుంది. 19మంది కంటెస్టెంట్స్‌తో మొద‌లైన ఈ షోని నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. శ‌ని, ఆది వారాల‌లో చాలా స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చే నాగ్‌ హౌజ్‌మేట్స్‌తో క‌లిసి చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. త‌ప్పులు చెబుతూ వాటిని స‌రిదిద్ద‌డం, విభేదాల‌తో విడిపోయిన వారిని క‌ల‌ప‌డం, నాలుగు గోడల మ‌ధ్య ఉన్న వీరికి వినోదం అందించ‌డం చేస్తున్నారు.

సంద‌డిగా సాగుతూ వ‌స్తున్న బిగ్ బాస్4 ఫినాలే డిసెంబ‌ర్ 20న భారీ లెవ‌ల్‌లో ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పటికే నిర్వాహ‌కులు అందుకు సంబంధించి ప్లాన్ చేస్తుండ‌గా,ఈ  ఫినాలేకు బ‌డా స్టార్‌నే గెస్ట్‌గా తీసుకురానున్నార‌నే టాక్స్ వినిపిస్తున్నాయి. గ‌త సీజ‌న్‌లో మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజ‌రై త‌న చేతుల మీదుగా రాహుల్ సిప్లిగంజ్‌కు ట్రోఫీ అందించారు. కాగా, ప్ర‌స్తుతం హౌజ్‌లో ఎనిమిది మంది స‌భ్యులు ఉండ‌గా, వారిలో అఖిల్ లేదా అభిజీత్‌ల‌లో ఒకరు విన్న‌ర్‌గా నిలుస్తార‌నే టాక్స్ వినిపిస్తున్నాయి


logo