‘క్రాక్’ 5 రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ డన్.. లాభాలు ఆన్

రవితేజ కెరీర్ మళ్లీ ట్రాక్ ఎక్కింది. క్రాక్ సినిమాతో మరోసారి ట్రాక్ ఎక్కాడు. మాస్ రాజా చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాడు. రాజా ది గ్రేట్ సినిమా దాదాపు 30 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత రవితేజ సినిమాలు ఏవి కూడా కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేదు. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా సినిమాలు కనీసం 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. దానికంటే లోపలే ఉండిపోయాయి. దాంతో రవితేజకు మళ్లీ కారెక్టర్స్ కరెక్ట్.. సైడ్ హీరో అయిపోవాల్సిందే అంటూ విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో వచ్చింది క్రాక్. సంక్రాంతి పండగంతా మాస్ రాజాలోనే కనిపిస్తుంది. ఈయన సినిమా 10కోట్లు కాదు 5 రోజుల్లోనే లాభాలు కూడా మొదలెట్టింది.
16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన క్రాక్.. కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో 17. 41 కోట్లు వసూలు చేసింది. అది కూడా షేర్.. గ్రాస్ దాదాపు 30 కోట్ల వరకు ఉంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం ముందు నుంచి కూడా పాజిటివ్ బజ్తోనే వచ్చింది. విడుదల సమయంలో కూడా కాస్త ఆలస్యం అయినా కూడా నైట్ షోస్ నుంచి రచ్చ మొదలైంది. కనీసం రోజుకు 2 కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తుంది క్రాక్. ఇప్పటి వరకు 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి క్రాక్ వసూలు చేసిన మొత్తం వివరాలు..
తొలిరోజు : Rs 6.54 కోట్లు
రెండో రోజు : Rs 3.15 కోట్లు
మూడో రోజు : Rs 2.86 కోట్లు
నాలుగో రోజు: Rs 2.69 కోట్లు
ఐదో రోజు: Rs 2.17 కోట్లు
5 రోజుల AP/TS కలెక్షన్స్ (షేర్) : Rs 17.41 కోట్లు ( 28.55 కోట్లు గ్రాస్)
ఇవి కూడా చదవండి
కృతిసనన్ కవిత్వానికి నెటిజన్లు ఫిదా
పూజా కార్యక్రమాలతో ప్రభాస్ 'సలార్' షురూ
రవితేజకు రెమ్యునరేషన్ ఫార్ములా కలిసొచ్చింది..!
మరో క్రేజీ ప్రాజెక్టులో సముద్రఖని..!
మంచులో వణుకుతూ 'నదిలా నదిలా' మేకింగ్ వీడియో
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ 2021 అవార్డు అందుకున్న హైదరాబాదీ
- పనస పండు తింటే కలిగే లాభాలేంటి?
- డిజిటల్ పేమెంట్స్: దిగ్గజాల మధ్య పోటీ.. ఎవరెవరు ఎటువైపు?
- షుగర్ కంట్రోల్‌కు మెరుగైన ఆహారాలు..!
- పోలీసుల అదుపులో యూట్యూబ్ ఫేమ్ షణ్ముక్ జశ్వంత్
- ముగిసిన మేడారం మినీ జాతర
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ దేశానికే దిక్సూచి
- 120హెచ్జడ్ డిస్ప్లేతో రెడ్మి నోట్ 10 సిరీస్!
- అసోం ఎన్నికల్లో పోటీ చేస్తాం: తేజశ్వి యాదవ్
- ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్.. ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ